ప్రాణాంతక
వూపిరితిత్తుల వ్యాధి బారిన పడిన కణజాలాన్ని గుర్తించేందుకు అధునాతన
3డీ ఎక్స్‌రే ఇమేజింగ్ పరిజ్ఞానాన్ని తొలిసారిగా శాస్త్రవేత్తలు ఉపయోగించారు.
ఇందులో ఫలితాలు ఆప్టికల్ మైక్రోస్కోప్ చిత్రాల మాదిరిగానే ఉండే అవకాశం
ఉంది. ఐడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్(ఐపీఎఫ్)గా వ్యవహరించే వూపిరితిత్తుల
వ్యాధిని గుర్తించేందుకు బ్రిటన్ సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు
ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దీనివల్ల ప్రతి బయాప్సీ నమూనాను 3డీలో క్షుణ్ణంగా
పరిశీలించవచ్చనీ, నిర్దిష్ట లక్ష్యంగా వైద్యచికిత్స అందించే అవకాశం వైద్యులకు
ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఐపీఎఫ్ సమస్యలో సరైన
చికిత్సను అందించేందుకు సమస్యను నిక్కచ్చిగా గుర్తించడం తప్పనిసరి
అని పరిశోధకులు మార్క్ జోన్స్ వివరించారు. ప్రతి రోగికి నిర్దిష్ట చికిత్స
పద్ధతిని రూపొందించే అవకాశం ఉంటుందన్నారు.
No comments:
Post a Comment