Sunday, 24 April 2016

దృష్టిలోపం ఉన్న వారి కోసం ప్రత్యేక యాప్

కంటి చూపు తక్కువ ఉన్న వారు స్మార్ట్‌ఫోన్‌ను వాడేటపుడు పెద్దగా కష్టపడకుండానే ఫోన్ స్క్రీన్‌ను చక్కగా ఉపయోగించేలా కొత్తరకం యాప్‌ను అభివృద్ధి చేశారు. భారత శాస్త్రవేత్త శ్రీనివాస్ పుండ్లిక్ నేతృత్వంలోని బృందం ఈ యాప్‌కు రూపకల్పన చేసింది.

కంటిచూపు తక్కువ ఉన్న వారు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించేటపుడు ‘గూగుల్ గ్లాస్’ ఉపకరణాన్ని ధరిస్తే ఫోన్ స్క్రీన్ గూగుల్ గ్లాస్‌లో కనిపిస్తుంది. గూగుల్ గ్లాస్‌ను ధరించాక వీరి తల కదలికలకు అనుగుణంగా ఫోన్ స్క్రీన్‌ను జూమ్ చేసి చూపిస్తుంది.


No comments:

Post a Comment