త్వరలో
మార్కెట్‌లోకి రానున్న ‘ఆండ్రాయిడ్
ఎన్’ ఆపరేటింగ్ సిస్టంపై
అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఈ ఓఎస్ మొదటి డెవలపర్ ప్రివ్యూలో
మల్టీ స్క్రీన్ ఫీచర్‌ను ప్రధానంగా
చూపించింది గూగుల్. ఇటీవల వచ్చిన
రెండో ఎడిషన్ ప్రివ్యూలో మరికొన్ని
ఆకట్టుకునే సదుపాయాలు ఉన్నట్లు
తేలింది.
ఐఫోన్ 6ఎస్‌లో 3డీ టచ్ ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ వల్ల ఏదైనా యాప్‌పై నొక్కిపట్టి అందులోని అంతర్గత ఆప్షన్లను(సబ్ ఫంక్షన్స్) చూడొచ్చు.
అలాంటి సదుపాయమే ఆండ్రాయిడ్ ఎన్‌లో ఉండనుందట. అలాగే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ల వినియోగం పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్‌బిల్ట్‌గా ‘వీఆర్ లిజనర్’.. ‘వీఆర్ హెల్ప్’ అనే యాప్‌లు రానున్నాయట. ఆండ్రాయిడ్ అప్లికేషన్లను వీఆర్ మోడ్‌లో వాడుకునే సదుపాయం కూడా ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
వీటితో పాటు.. చేతులు లేని వాళ్లు.. చూపు లేని వాళ్లు ఫోన్‌ను వాడేందుకు వీలుగా ‘వాయిస్ కంట్రోల్ యాక్సెస్’ ఫీచర్ కూడా ‘ఆండ్రాయిడ్ ఎన్’లో ఉంటుందని గూగుల్ ఇటీవల వెల్లడించింది. ప్రస్తుతం డెవలపర్ ప్రివ్యూలను మాత్రమే గూగుల్ విడుదల చేసింది. వచ్చే నెలలో జరిగే ఇన్‌పుట్/అవుట్‌పుట్ డెవలపర్ల సదస్సులో పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

No comments:
Post a Comment