Wednesday, 20 April 2016

CHINA COMPANY LEE INTRODUCES NEW SMART PHONES


ఈ ఫోన్‌లో 6జీబీ ర్యామ్‌!
బీజింగ్‌ : చైనా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ లీ ఎకో బుధవారం కొత్తగా మూడు స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేసింది. చైనాలోని బీజింగ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో లీ మేక్స్‌2, లీ2, లీ2 ప్రో పేర్లతో వాటిని విడుదల చేసింది. వీటిలో లీ మ్యాక్స్‌2ని ఏకంగా 6జీబీ ర్యామ్‌తో విడుదల చేసింది. ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి. లీ మ్యాక్స్‌ 2
* 5.7 అంగుళాల తాకే తెర
* 1440×2560 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
* 6జీబీ ర్యామ్‌
* 64జీబీ అంతర్గత మెమొరీ
* క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌
* 21 మెగాపిక్సల్‌ కెమేరా
* 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా
* ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టం
* 3100 ఎంఏహెచ్‌ బ్యాటరీ
లీ2 స్మార్ట్‌ ఫోన్‌
* 5.5 అంగుళాల తాకే తెర
* 1080×1920 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
* 32జీబీ అంతర్గత మెమొరీ
* 16 మెగాపిక్సల్‌ కెమేరా
* 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా
* ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టం
* 3జీబీ ర్యామ్‌
* మీడియా టెక్‌ హీలియో ఎక్స్‌20 ప్రాసెసర్‌
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
లీ 2 ప్రో
* 5.5 అంగుళాల తాకే తెర
* 1080×1920 పిక్సల్స్‌
* మీడియా టెక్‌ హీలియో ఎక్స్‌25 ప్రాసెసర్‌
* 21 మెగాపిక్సల్‌ కెమేరా
* 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమేరా
* 4జీబీ ర్యామ్‌
* ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌మాలో ఆపరేటింగ్‌ సిస్టం
* 32జీబీ అంతర్గత మెమొరీ
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

No comments:

Post a Comment