చీకట్లోనూ చూడగలిగే లెన్స్
వాషింగ్టన్: చిమ్మ చీకటిలోనూ చూడగలిగే కృత్రిమ లెన్స్‌ను
శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చీకట్లో చూడగలిగే పీతలు, చేపలపై
అధ్యయనంతో అమెరికాకు చెందిన విస్కాసిన్-మేడిసన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ
లెన్స్‌లను తయారు చేశారు. బాంబులను నిర్వీర్యం చేసే రోబోలలో, ఉదరకోశ
సర్జరీల్లో, దూరంలోని గ్రహాలను వీక్షించే టెలిస్కోప్‌లలో ఈ లెన్స్‌లు
ఉపయోగపడుతాయని తెలిపారు. ఈ మేరకు పరిశోధన వివరాలను ప్రోసీడింగ్స్ ఆఫ్ ది
నేషనల్ అకాడెమీ ఆఫ్ సెన్సైస్ (పీఎన్‌ఏఎస్) జర్నల్‌లో ప్రచురించారు
No comments:
Post a Comment