Wednesday, 20 April 2016

INTEX introdces new budget smart phone at just 1990/- onlyy


ఇంటెక్స్‌ నుంచి బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌
న్యూదిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తుల సంస్థ ఇంటెక్స్‌ అత్యంత తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంటెక్స్‌ ఆక్వా జీ2 పేరుతో ఈ విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.1,990. బూడిద రంగులో ఈ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు లభ్యం కానుంది. కొన్ని రోజుల క్రితం ఇంటెక్స్‌ నుంచి క్లౌడ్‌ జెమ్‌ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ను రూ.3,299కే విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ స్నాప్‌డీల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు..
* 2.8 అంగుళాల తెర
* 0.3 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ అండ్‌ రేర్‌ కెమెరా
* 256ఎంబీ ర్యామ్‌
* 512ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజి
* 1100ఎంఏహెచ్‌ బ్యాటరీ సదుపాయం
* 2జీ సపోర్టింగ్‌

No comments:

Post a Comment